షార్జా-దోహా ఫ్లైట్ సర్వీస్ పునరుద్ధరణ..ప్రకటించిన ఎయిర్ అరేబియా
- January 15, 2021
షార్జా నుంచి దోహా వరకు విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు యూఏఈ లో కాస్ట్ ఎయిర్ లైన్స్ ఎయిర్ అరేబియా ప్రకటించింది. ఇక నుంచి ప్రతి రోజు షార్జా నుంచి దోహాకు విమాన సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎయిర్ అరేబియా అధికారిక వెబ్ సైట్ తో పాటు కాల్ సెంటర్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని వివరించింది. అంతేకాదు తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే వారి ఆరోగ్య భద్రత కోసం తాము అన్ని జాగ్రత్త ప్రమాణాలు పాటిస్తున్నట్లు కూడా ఎయిర్ అరేబియా వెల్లడించింది. ప్రయాణికులకు కోవిడ్ 19 ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నామని తెలిపింది. టికెట్లు బుక్ చేసుకున్న వివరాలతోనే ప్రయాణికులకు బీమా కల్పిస్తున్నామని, అదనంగా ఒక్క పైసా కూడా ఛార్జ్ చేయటం లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష