నిమ్మరసంతో అద్భుతమైన ప్రయోజనాలు...

- January 15, 2021 , by Maagulf
నిమ్మరసంతో అద్భుతమైన ప్రయోజనాలు...

వేసవి కాలంలోనే కాదండోయ్.. ఏ కాలంలో అయినా నిమ్మ రసం రోజూ తీసుకుంటే మంచిది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండడంతో సీజనల్ వ్యాధులు దరి చేరవు. చర్మ సంబంధిత సమస్యలు రావు. ఇక డయాబెటిస్ (చక్కెర వ్యాధి)తో బాధపడుతున్న వారైతే రోజూ ఓ గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే అనేక లాభాలు.. విటమిన్ సి ఉన్న ఏ ఆహార పదార్థాలైనా షుగర్ ఉన్న వారికి మంచిది. దీనివల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మీడియం సైజు నిమ్మకాయలో 2.4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. అందువలన డయాబెటిస్ ఉన్నవారు నిమ్మరసం తాగడం వలన ఇందులో ఉన్న ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో ఇన్సులిన్ తీసుకునే అవసరం ఎక్కువగా ఉండదు. ఫలితంగా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారు గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే నిమ్మరసం రోజూ తీసుకుంటే ఇందులో ఉన్న పొటాషియం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. డయాబెటిస్ ఉన్న వారు తరచూ జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో గ్యాస్, ఎసిడిటి, మలబద్దకం లాంటి సమస్యలు వస్తాయి. అలాంటి వారు నిమ్మరసం రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com