ఇండియా ఇన్స్యూరెన్స్ కవర్ కేవలం 62 ఫిల్స్‌కే
- February 23, 2016
యూఏఈ బేస్డ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్, వలసదారుల కోసం కొత్త ఇన్స్యూరెన్స్ విధానం అందుబాటులోకి వచ్చింది. రోజుకి కేవలం 1.87 దిర్హామ్ చెల్లించి నలుగురికి కవరేజ్ పొందవచ్చు. అలాగే, ఒక వ్యక్తి కోసం అయితే కేవలం 62 ఫిల్స్ (రోజుకి) లైఫ్ కవర్ ఇవ్వనుంది ఈ కొత్త విధానం ద్వారా. డిఎం హెల్త్ కేర్ యొక్క అరైజ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌లో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. దుబాయ్‌లో సోమవారం ఈ ప్లాన్స్‌ని వెల్లడించారు. 6000 పైగా హాస్పిటల్స్ తమ నెట్‌వర్క్ కింద భారతదేశంలో ఉన్నాయని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. యూఏఈలోని వలసదారులకి, వారి స్వదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఈ స్కీమ్ ఎంతో ఉపయోగకరమని ఇన్స్యూరెన్స్ కంపెనీ చెబుతుంది. 2,400 దిర్హామ్‌ల విలువ చేసే పాలసీ లేదా రోజుకి 6.57 దిర్హామ్‌ల విలువ చేసే పాలసీ, వలసదారుడితో కలిపి ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి, సుమారు 250,000 రూపాయల కవరేజ్‌ని అందిస్తుందన్నారు. ఇన్స్యూరెన్స్ స్కీమ్, ఔట్ పేషెంట్ బెనిఫిట్స్‌ని కూడా (కేవలం ఇండియాలో మాత్రమే) అందిస్తుంది. వయసును బట్టి ప్రీమియంలో స్వల్ప మార్పులు ఉంటాయి.ఈ ఏడాదికి 10,000 పోలసీలను అమ్మాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఖతార్, ఒమన్, సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్‌లకు ఈ సేవల్ని విస్తరించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







