భారత్‌తో ఒమన్ వ్యూహాత్మక సంప్రదింపులు

- January 16, 2021 , by Maagulf
భారత్‌తో ఒమన్ వ్యూహాత్మక సంప్రదింపులు

మస్కట్:ఒమన్ సుల్తానేట్, భారత ప్రభుత్వం మధ్య న్యూఢిల్లీలో వ్యూహాత్మక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగయ్యేందుకు ఈ చర్చలు మరింత దోహదపడతాయని ఇరు దేశాలూ పేర్కొన్నాయి. ఎనర్జీ, ట్రేడ్, ఇన్వెస్టిమెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కాన్సులర్ విభాగం.. ఇలా పలు అంశాలకు సంబంధించి ఈ చర్చలు జరిగాయి. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ - డిప్లమాటిక్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ షేక్ ఖలీఫా బిన్ అలి అల్ హరితి, భారత విదేశాంగ శాఖ అండర్ సెక్రెటరీ సంజయ్ భట్టాచార్య ఈ సంప్రదింపుల కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్‌పై పోరులో పరస్పర సహకారం గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com