ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
- January 16, 2021
హైదరాబాద్:తెలుగు చిత్ర ప్రేమికులకు మాస్‌లోనే కొత్త తరహా యాంగిల్ చూపించన ఘనత త్రివిక్రమ్, ఎన్టీఆర్లకే దక్కుతోంది. అరవింద సమేతా సినిమాతో కొత్త రకం మాస్‌ను అభిమానులకు పరిచయం చేశారు. దాంతో వీరి కాంబోలో మరో సినిమా రావాలని అభిమానులు కోరుకున్నారు. వారి కోరిక అప్పుడే నెరవేరింది. ఎన్టీఆర్, త్రవిక్రమ్ కాంబోలో మరో సినిమా ఉంటుందని అప్పుడే ప్రకటించారు. కానీ అది ఎప్పుడు మొదలవుతుందని క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇటీవల వీరి కాంబోలో రెండో సినిమా పట్టాలెక్కనుందని క్లారిటీ ఇచ్చిన అభిమానులకు తీపికబురు వినిపించారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ సెంటిమెంట్ ‘అ’తో ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే పేరును ఫిక్స్ చేశారట. కాన కొన్న రోజుల క్రితం ఈ సినిమాకు పేరు మారిందని. నాయుడు సెంటిమెంట్‌తో దీనికి ‘చౌడప్ప నాయుడు’ అనే పేరు పెడుతున్నారిన వార్తలు వినిపించాయి. అయితే ఒక్కసారి ఫిలిం ఛాంబర్లో పేరు నమోదు చేశాక అదే ఫైనల్ అవుతుంది. కానీ ఈ సినిమా టైటిల్ సందేహాలు అనేకంగా వచ్చాయి. వీటికి సమాధానం అంటే సినిమాకి మొదటి టైటిల్ ఫిక్స్ అనే చెప్పాలి. కానీ ఇందులో ఎన్టీఆర్ పాత్రకు చౌడప్ప నాయుడు అనే పేరు ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాకు మొదటి టైటిల్ ఫిక్స్ అయినట్లే. ఇక ఎన్టీఆర్ పాత్ర పేరు కోసం మరి కొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







