మస్కట్: ఇన్వెస్ట్మెంట్స్, రెసిడెన్సీ రెన్యూవల్ కోసం 1000 దరఖాస్తులు
- January 16, 2021
మస్కట్:విదేశీ పెట్టుబడుదారుల తమ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఇన్వెస్ట్ మెంట్స్, రెసిడెన్సీ రెన్యూవల్ కోసం దాదాపు 1000 అప్లికేషన్లు వచ్చినట్లు పరిశ్రమలు, వాణిజ్య, పెట్టుబడుల ప్రొత్సహాక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే..కోవిడ్ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్ మెంట్, రెసిడెన్సీ రెన్యూవల్ కోసం ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. సాధారణంగా రెన్యూవల్ కోసం విదేశీ పెట్టుబడుదారులు దరఖాస్తు చేసుకున్న తర్వాత...పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు, పోలీసులు, కార్మిక శాఖ అధికారులు సంయుక్తంగా ఆయా యూనిట్లను నేరుగా పరిశీలించి ఆ తర్వాత రెన్యూవల్ ప్రక్రియకు ఆమోదం తెలుపుతారు. అయితే...ప్రస్తుతం కోవిడ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారుల బృందం క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఉండదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకుంటే ఫీల్డ్ విజిట్ లేకుండానే ఇన్వెస్టర్ కార్డులను జారీ చేస్తామని వెల్లడించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







