ఏ.పీలో కరోనా కేసుల వివరాలు...

ఏ.పీలో కరోనా కేసుల వివరాలు...

అమరావతి:ఏ.పీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారంతో పోల్చితే శనివారం కేసుల సంఖ్య కాస్త పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 25,542 మందికి కరోనా టెస్టులు చేయగా 114 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,824కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ శనివారం కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌‌లో వెల్లడించింది. శుక్రవారం ఒక్క రోజే కోవిడ్-19 నుంచి కోలుకుని 326 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం రికవరీల సంఖ్య 8,76,372కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,987 యాక్టివ్‌ కేసులున్నాయి.మొత్తం మృతుల సంఖ్య 7,139గా ఉంది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Back to Top