సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పటిల్ నుంచి డిశ్చార్జ్

- February 23, 2016 , by Maagulf
సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పటిల్ నుంచి డిశ్చార్జ్

సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్దోపడెక్స్ హాస్పటిల్ లో చేరినట్టు వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు కంగారు పడ్డారు . ఈ లోగా రజనీ డిశ్చార్జ్ అయ్యారనే వార్త మంగళవారం బయటకు వచ్చింది. అసలు రజనీ హాస్పిటల్ కు ఎందుకు వెళ్ళినట్టు అనే కదా మీ డౌట్ ?రజనీ కాంత్ గత మూడు నెలల నుండి మలేషియాలో 'కబాలి' సినిమా కోసం షూటింగ్ చేస్తున్నారు. అంతే కాకుండా మధ్యలో రెండుసార్లు ఇండియా వచ్చి గోవాలో ఒక కొత్త షెడ్యూల్ లో కూడా పాల్గొన్నారు. మరో వైపు 2.0 చిత్రం కోసం కసరత్తులు చేస్తున్నారు తలైవా. ఇలా గ్యాప్ లేకుండా రజనీ కష్టపడుతుండడంతో ఆయనపై విపరీతమైన ప్రెజర్ పడిందట.
దీంతో ఒకసారి గా డల్ అయిన సూపర్ స్టార్ బాడీ చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లారట.ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డి రవిచంద్రన్ రజినీకు పరీక్షలు నిర్వహించి కాస్త రెస్ట్ తీసుకోమని , కొద్ది రోజులు షూటింగ్ కు కూడా బ్రేక్ ఇవ్వమని సలహా ఇచ్చినట్లు సమాచారం. రజినీ త్వరలో 2.0 చిత్ర యూనిట్ తో కలవనుండగా అక్షయ్ కుమార్ , రజనీల మధ్య కొన్ని ఫైట్ సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com