జనవరి 22 నుంచి వీసా ఎక్స్‌టెన్షన్ ఫీజు

జనవరి 22 నుంచి వీసా ఎక్స్‌టెన్షన్ ఫీజు

మనామా:నేషనాలిటీ పాస్పోర్ట్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (NPRA) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆటోమేటిక్ మరియు ఫ్రీ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ విజిటింగ్ వీసాస్ ఆగిపోతాయనీ, ఫీ లెవిస్, జనవరి 22 నుంచి ప్రారంభమవుతాయని తెలుస్తోంది. గ్రేస్ పీరియడ్ 2020 ఏప్రిల్ 21 నుంచి ప్రారంభమయ్యిందనీ, కరోనా నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారనీ, దానికి ముగింపు పలుకుతున్నామని అధికారులు పేర్కొన్నారు. విజిటర్స్ ఇకపై తమ వీసాల గడువు పొడిగింపు కోసం బహ్రెయిన్ అధికారిక వెబ్‌సైట్ లేదా ముహరాక్ సెక్యూరిటీ కాంప్లెక్స్‌, ఇసా టౌన్ ఆఫీస్ (సదరన్ గవర్నరేట్ పోలీస్ దగ్గర) వంటి చోట్ల ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకుని సందర్శించాలని అధికారులు పేర్కొన్నారు. స్కప్లినో యాప్ ద్వారా అపాయింట్‌మెంట్లు బుక్ చేసుకోవచ్చు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Back to Top