ప్రమాణ స్వీకారానికి రైల్లో వస్తానన్న 'జో బైడెన్'...అయితే..

- January 19, 2021 , by Maagulf
ప్రమాణ స్వీకారానికి రైల్లో వస్తానన్న \'జో బైడెన్\'...అయితే..

సామాన్య పౌరుడిగా, సెనేటర్‌గా రైలు ప్రయాణంతో తన జీవితం ముడిపడి ఉంది అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు బైడెన్‌కి. అందుకే అధ్యక్ష పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి రైల్లో రావాలనుకున్నారు. కానీ భద్రతా సిబ్బంది ఆయన కోరికను కాదన్నారు.

గత వారం యుఎస్ కాపిటల్ అల్లర్ల నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 20 న ఆయన ప్రమాణ స్వీకార ప్రారంభోత్సవం రోజున హింసాకాండ భయాల మధ్య, అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ కోరికను భద్రతా సిబ్బంది తిరస్కరించింది. మూడు దశాబ్దాల వృత్తిలో తన అభిమాన రవాణా మార్గమైన వాషింగ్టన్కు ఆమ్ట్రాక్ రైలులో వచ్చి అధ్యక్షపదవిని చేపట్టాలనుకున్నారు బైడెన్.
బైడెన్ మొదట 90 నిమిషాల రైలు ప్రయాణాన్ని తన స్వస్థలమైన విల్మింగ్టన్, డెలావేర్ నుండి వాషింగ్టన్ లోని యూనియన్ స్టేషన్‌ వరకు రావాలనుకున్నారు. కానీకాపిటల్‌తో పాటు దేశవ్యాప్తంగా ముప్పు ఉన్న కారణంగా ఈ ప్రణాళికను రద్దు చేయాల్సి వచ్చింది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు జనవరి 6 న కాపిటల్ ను ఉల్లంఘించిన తరువాత భద్రత గణనీయంగా పెరిగింది, తరువాత జరిగిన ఘర్షణలో కనీసం ఐదుగురు మరణించారు.

బైడెన్ చాలాకాలంగా తన వ్యక్తిగత జీవితంతో పాటు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా అమ్ట్రాక్ రైలులోనే ప్రయాణించి విధులకు హాజరయ్యేవారు. రోజూ అలా రైల్లో ప్రయాణించి వస్తున్నారని ఆయనను "ఆమ్ట్రాక్ జో" అనే పిలుస్తారు. 1972 లో తన భార్య మరియు చిన్న కుమార్తె కారు ప్రమాదంలో మరణించిన తరువాత తన చిన్న కుమారులను చూసుకోవటానికి వాషింగ్టన్, డెలావేర్ మధ్య క్రమం తప్పకుండా రైల్లోనే ప్రయాణించేవారు. సెనేటర్‌గా ఉన్నప్పుడు కూడా దశాబ్దాలుగా రైల్లోనే ప్రయాణం చేసేవారు. ఇలా దాదాపు 40 సంవత్సరాలపాటు రైలు ప్రయాణం చేశారు బైడెన్.

2011లో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు జో గౌరవార్థం.. విల్‌మింగ్టన్ స్టేషన్ పేరును.. జోసెఫ్ ఆర్ బైడెన్ జూనియర్ రైల్ రోడ్ స్టేషన్ అని మార్చింది ఆమ్ట్రాక్. రైలు ప్రయాణం నాకెన్నో తీపి గుర్తులను మిగిల్చింది.

నా జీవితంలో ఎదురైన కష్టసుఖాలకు సాక్ష్యం ఈ రైలు.. 2017లో ఉపాధ్యక్ష పదవి నుంచి దిగిపోయి ఇంటికి వస్తుంటే.. రైల్లో నేను ఎన్ని లక్షల మైళ్లు ప్రయాణించింది లెక్కలు తీశారు.. మొత్తం 20 లక్షల మైళ్లు ప్రయాణించానని బైడెన్ తన అనుభూతుల్ని పంచుకున్నారు. అందుకే అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసేందుకు కూడా రైల్లో రావాలన్న తన చిరు కోరికను భద్రతా సిబ్బంది కాదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com