టీమిండియాకు 5 కోట్ల బోనస్
- January 19, 2021
ముంబై: టీమిండియా క్రికెటర్లపై కనక వర్షం కురిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకున్న టీమిండియా ఆటగాళ్లకు రూ.5 కోట్ల టీమ్ బోనస్‌ను ప్రకటించింది బీసీసీఐ. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాలు కూడా ఈ విషయాన్ని తెలిపారు. గబ్బా టెస్టులో 3 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నది. అసాధారణ రీతిలో సిరీస్‌ను గెలిచిన భారత క్రికెటర్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.
"The BCCI has announced INR 5 Crore as team bonus"- BCCI Secretary Mr @JayShah tweets.#TeamIndia pic.twitter.com/vgntQuyu8V
— BCCI (@BCCI) January 19, 2021
ఇదో అద్భుత విజయం అని, ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ టెస్ట్ సిరీస్‌ను గెలవడం అపూర్వమని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అన్నారు. భారత క్రికెట్ చరిత్రలో ఈ విజయం ఎన్నటికీ మరిచిపోనిదన్నారు. సిరీస్‌లో పాల్గొన్న భారత జట్టుకు 5 కోట్ల బోనస్ ప్రకటిస్తున్నట్లు తన ట్వీట్‌లో గంగూలీ తెలిపారు. ఈ గెలుపు విలువకు ఏదీ సమానం కాదన్నారు. టూర్‌లో పాల్గొన్న ప్రతి ఆటగాడిని గంగూలీ మెచ్చుకున్నారు. ఆటగాళ్లకు టీమ్ బోనస్‌గా 5 కోట్లు ప్రకటించామని, భారత క్రికెట్‌కు ఇవి ప్రత్యేకమైన క్షణాలని, అద్భుత నైపుణ్యాన్ని, ప్రతిభను భారత జట్టు ప్రదర్శించిన కార్యదర్శి జే షా తన ట్వీట్‌లో తెలిపారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం