యూఏఈ చేరుకున్న భారత మంత్రి మురళీధరన్

- January 19, 2021 , by Maagulf
యూఏఈ చేరుకున్న భారత మంత్రి మురళీధరన్

భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ సోమవారం అబుదాబీ చేరుకున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా అబుదాబీ చేరుకున్న మురళీధరన్‌కి యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ ఘన స్వాగతం పలికారు. భారత వలస కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఇండియన్ గ్రూప్స్‌తో సమావేశం కానున్నారు మంత్రి మురళీధరన్. మూడు రోజుల యూఏఈ పర్యటనలో మురళీధరన్, యూఏఈకి చెందిన పలువురు ప్రముఖులతో, అధికారులతో భేటీ కానున్నారు. 2019 అక్టోబర్‌లో చివరిసారిగా మురళీధరన్ యూఏఈలో పర్యటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ - యూఏఈ సంయుక్తంగా పనిచేశాయి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాలకు ఎంతో ఉపయోగకరమని ఇరు దేశాల ప్రముఖులు పలు సందర్భాల్లో అభిప్రాయ పడ్డారు. 2020 నవంబర్‌లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ యూఏఈలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com