యూఏఈ: త్వరలో డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ షురూ
- January 20, 2021
యూఏఈ:దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం వీలైనంత వరకు ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందివ్వాలనే యూఏఈ లక్ష్యానికి అనుగుణంగా అబుధాబి ఆరోగ్య శాఖ యంత్రాంగం అడుగులు వేస్తోంది. మార్చి నాటికి అర్హులైన వారిలో 50 శాతం మందికి వ్యాక్సిన్ అందించాలని టార్గెట్ గా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైన వారు తమ డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ సెంటర్లకు చేరుకొని వాహనాల్లోనే వ్యాక్సిన్ తీసుకొని వెళ్లవచ్చు. దీని ద్వారా వ్యాక్సినేషన్ శాతం పెరుగుతుందని అబుధాబి ఆరోగ్య శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. కింగ్డమ్ లో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని, అయినప్పటికీ కొందరిలో మాత్రం ఇంకా అనుమానాలు నెలకొని ఉన్నాయని అబుధాబి హెల్త్ డిపార్ట్మెంట్ చైర్మన్ అన్నారు. కింగ్డమ్ దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్ శాస్త్రీయంగా కఠిన దశలను దాటుకొని అందుబాటులోకి వచ్చిందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. నాణ్యత, ప్రభావశీలత పరంగా వ్యాక్సిన్ పై అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. అబుధాబితో పాటు రాజధాని వెలుపల డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ సెంటర్లను 218 వరకు పెంచుతామని వెల్లడించారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







