యూఏఈలో వ్యాక్సిన్ తీసుకున్న BAPS హెడ్..వ్యాక్సినేషన్లో అందరూ పాల్గొనాలని పిలుపు
- January 22, 2021
యూఏఈ:యూఏఈలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. మరింత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకునేలా ప్రొత్సహించేందుకు ప్రముఖులు కూడా వ్యాక్సినేషన్ లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా హిందూ ధార్మిక సమాజానికి ఆరాధకుడు, బాప్స్ హిందూ మందిర్ హెడ్ పూజ్య బ్రహ్మవిహారి స్వామి కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా ఫ్రీ కంట్రీగా యూఏఈని మల్చుకోవటం కోసం కింగ్డమ్ ప్రభుత్వం, ఫ్రంట్ లైన్ వర్కర్లు చేస్తున్న కృషికి మద్దతుగా డ్రైవ్ పాల్గొన్నట్లు స్వామి తెలిపారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు వ్యాక్సిన్ తయారీలో కీలక పాత్ర పోషించిన సైంటిస్టులు, పరిశోధకులు, సలహాదారుల వంటి బ్యాక్ లైన్ వర్కర్ల కృషిని ఆయన ప్రశంసించారు. సమాజంలోని పౌరులు కూడా తమ వంతు బాధ్యతగా వ్యాక్సిన్ తీసుకొని సురక్షిత సమాజానికి తోడ్పాటు అందించాలని స్వామిజీ కోరారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష