ఇండియా ఫెస్ట్ 2021 ప్రారంభించిన లులు హైపర్ మార్కెట్

ఇండియా ఫెస్ట్ 2021 ప్రారంభించిన లులు హైపర్ మార్కెట్

కువైట్‌: రీజియన్‌లో ప్రముఖ హైపర్ మార్కెట్ అయిన లులు హైపర్ మార్కెట్ వార్షిక ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్‌ను జనవరి 21న ప్రారంభించింది. అల్ రాయి ఔట్‌లెట్ వద్ద దీన్ని ప్రారంభించారు. కువైట్‌లో భారత రాయబారి అయిన సిబి జార్జి ఈ ఫెస్టివల్‌ని ప్రారంభించారు. జనవరి 26 వరకు ఈ పెస్టివల్ కొనసాగుతుంది. ఇండియన్ బ్రాండెడ్ ఉత్పత్తులపై ఈ ఫెస్టివల్ సందర్భంగా భారీ డిస్కంట్లు వినియోగదారులకు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. భారత దేశం నుంచి దిగుమతి చేసుకున్న పండ్రలు, కూరగాయలపై కూడా తగ్గింపు ధరలు అమల్లో వుంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలు ఈ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి భోజన ప్రియుల కోసం.

Back to Top