ఫిబ్రవరి 19న విడుదల కానున్న 'చెక్'
- January 22, 2021హైదరాబాద్:టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరీర్లో 28వ సినిమాగా 'చెక్' రాబోతుంది. ఈమేరకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 19న 'చెక్' ప్రేక్షకుల ముందుకు రానుందని పోస్టర్ ద్వారా తెలిపింది చిత్రయూనిట్. కాగా గతేడాది హీరో నితిన్ 'భీష్మ' హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. చాలా కాలం తరువాత నితిన్ కి ఈ సినిమా సక్సెస్ ను ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నితిన్ డిఫరెంట్ మూవీగా 'చెక్' చేస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈమద్యే రిలీజ్ అయిన టీజర్ లో.. ఖైదీగా నితిన్‌ని చూపిస్తూ ఆయనకు చెస్ ఆడే టాలెంట్ ను చూపించారు. ఈ సినిమా టీజర్ బట్టి చుస్తే నితిన్ మరో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు నితిన్. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమాలు ప్రేక్షకునికి దగ్గరగా ఉండడం కలిస్తోందనే చెప్పాలి. ఇక నితిన్, కీర్తి సురేష్ తోను నటించిన ‘రంగ్ దే’ సినిమా కూడా ఈ వేసవిలోనే విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!