3 డయాగ్నొస్టిక్ మినీ హబ్ లను ప్రారంభించిన టి.హోం మంత్రి
- January 22, 2021హైదరాబాద్:హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో డయాగ్నొస్టిక్ మినీ హబ్ లను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో పురానాపూల్, పానీ పుర, బర్కాస్ లలో మినీ హబ్ లను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా హోం మంత్రి ప్రజలందరికీ ఉచిత వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఇప్పటికే బస్తీ దవాఖాన లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.ఈసీజీ, యు ఎస్ జి, ఎక్సరే,ఇతర రేడియాలజీ సర్వీసులను ఈ మినీ హబ్ ల ద్వారా పేదలకు అందిస్తామని హోంమంత్రి తెలియజేశారు.బస్తీ దవాఖానలలో సూచించిన పరీక్షలను మినీ హబ్ లలో చేయడం ద్వారా పేద ప్రజలు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా మెడికల్ రిపోర్ట్ లను పొందవచ్చని పేర్కొన్నారు.అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, ఆసుపత్రులలో ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, డాక్టర్ ఉమా, డాక్టర్ నందిత తదితర వైద్య అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు