ఓడలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో వినోదాలపై నిషేధం విధించిన దుబాయ్

ఓడలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో వినోదాలపై నిషేధం విధించిన దుబాయ్

కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఎప్పటికప్పుడు అవసరమై నిర్ణయాలు తీసుకుంటున్న దుబాయ్ పాలన యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓడలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో విందులు, వినోదాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దుబాయ్ మారిటైమ్ సిటీ అథారిటీ తమ అధికారిక ట్విటర్ ఖతాలో ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు నిషేధం అమలులో ఉంటుందని వెల్లడించింది. వినోదాల, వేడుకలలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలు జరిగే అవకాశాలు ఉన్నాయని, జనం భౌతిక దూరం పాటించేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంసీఏ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అందుకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించింది. 

Back to Top