అబుధాబి: అసియా కమ్యూనిటీని కించపరిచిన నలుగురు అరబ్బుల అరెస్ట్

అబుధాబి: అసియా కమ్యూనిటీని కించపరిచిన నలుగురు అరబ్బుల అరెస్ట్

ఆసియాకు చెందిన ఓ కమ్యూనిటీ కించపరుస్తూ వారిని ఎగతాళి చేసిన కేసులో నలుగరు అరబ్బులను అరెస్ట్ చేయాలని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యుఎఇ అటార్నీ జనరల్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్రైమ్స్ నలుగురు నిందితులను విచారించి, వారి ప్రీట్రియల్ డిటెన్షన్ పెండింగ్ దర్యాప్తుకు ఆదేశించింది. నిందితులు నలుగురు అసియాకు చెందిన ఓ కమ్యూనిటీ ఎగతాళి చేస్తూ ప్రవర్తించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో కాస్తా అధికారుల దృష్టికి వెళ్లింది. యూఏఈ సహనశీలత, నైతిక విలువలకు ఇది పూర్తిగా వ్యతిరేకమని ఆగ్రహించిన అధికారులు వీడియో ఆధారంగా నలుగురిని అరెస్ట్ చేశారు. 

Back to Top