సౌదీలో సీట్ బెల్ట్ రూల్ బ్రేక్ చేస్తున్న 86% మంది మహిళలు..ఓ సర్వే రిపోర్ట్

- January 22, 2021 , by Maagulf
సౌదీలో సీట్ బెల్ట్ రూల్ బ్రేక్ చేస్తున్న 86% మంది మహిళలు..ఓ సర్వే రిపోర్ట్

సౌదీ అరేబియాలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిలో పురుషులతో పాటు మహిళలు పోటీ పడుతున్నారు. కింగ్డమ్ లో దాదాపు 86 శాతం మంది మహిళలు సీల్ట్ బెల్టు పెట్టుకోవటం లేదని అబ్దుల్లా ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో తేలింది. సీట్ బెల్ట్ రూల్ బ్రేక్ చేసిన వారిలో మహిళా డ్రైవర్లు, ఫ్రంట్ సీట్లో కూర్చొని ప్రయాణించిన వారు ఉన్నారని సర్వే రిపోర్ట్ వెల్లడించింది. ఆస్పత్రులకు వచ్చే దాదాపు కార్లను దాదాపు రెండేళ్లకు పరిశీలించి ఐదు వేల మంది యువకులను పరిగణలోకి తీసుకొని సర్వే చేసినట్లు సర్వేలో తెలిపారు. మొత్తం 52.4 శాతం మంది 18 నుంచి 25 ఏళ్లలోపు వారున్నారు. అయితే..42.8 శాతం మంది మాత్రం ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటిస్తున్నారని..మిగిలిన వారు అడపాదడపా రూల్ బ్రేక్ చేస్తున్నారని సర్వేతో స్పష్టం అయింది. కింగ్డమ్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు నిఖచ్చిగా అమలు చేసేందుకు మరింత ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అబ్దుల్లా ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ సర్వే రికమండ్ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com