ఇల్లీగల్ ఐటమ్స్ సీజ్, వెబ్ సైట్స్ బ్లాక్...నకిలీలపై ఎస్ఏఐపీ కొరడా

- January 23, 2021 , by Maagulf
ఇల్లీగల్ ఐటమ్స్ సీజ్, వెబ్ సైట్స్ బ్లాక్...నకిలీలపై ఎస్ఏఐపీ కొరడా

రియాద్:మేథో సంపతి హక్కులను రక్షించేందుకు సౌదీ అథారిటీ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ-ఎస్ఏఐపీ కఠిన చర్యలు చేపట్టింది. కింగ్డమ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి క్రియేటివ్ రైట్స్ ఉల్లంఘనలకు పాల్పడిన 11,620 వస్తువులను సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు, సౌండ్ రికార్డింగ్స్, ప్రింటెండ్ వర్క్స్ ఉన్నట్లు ఎస్ఏఐపీ అధికారులు వివరించారు. ఐపీ హక్కుల పరిరక్షణతో పాటు వెబ్ సైట్ల నిర్వహణపై కూడా అధికారులు ఫోకస్ చేశారు. మేథో సంపత్తి, హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు గుర్తించిన వెబ్ సైట్లపై చర్యలు తీసుకున్నారు. మొత్తం 355 వెబ్ సైట్లపై నిఘా పెట్టిన అధికారులు..నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న 77 వెబ్ సైట్లను బ్లాక్ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com