విడుదలకు సిద్దమవుతున్న 'బ్యాక్ డోర్'
- January 23, 2021
హైదరాబాద్:నంది అవార్డు అందుకున్న దర్శకుల్లో కర్రి బాలాజీ కూడా ఒకరు. ఇతడి దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథాచిత్రం 'బ్యాక్ డోర్'. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. ప్రముఖ కథానాయకి పూర్ణ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ వినూత్న కథా చిత్రాన్ని 'ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ త్రిపురాన మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నడు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘ఈ సినిమా పూర్ణ కెరీర్ లో ఓ మైల్ స్టోన్‌గా నిలిచిపోతుంది. పూర్ణ పెర్ఫార్మెన్స్, ఆమె గ్లామర్ 'బ్యాక్ డోర్" చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్థాయి" అని దర్శకుడు కర్రి బాలాజి అన్నారు. 'దర్శకుడిగా బాలాజీకి చాలా మంచి పేరు తెచ్చే చిత్రమిది. మా "బ్యాక్ డోర్" సినిమా చేస్తుండగానే పూర్ణకి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ సినిమా రావడం మాకు చాలా సంతోషం కలిగించింది. అలాగే కంగనా రనౌత్ నటిస్తున్న జయలలిత బయోపిక్‌లోనూ మా హీరోయిన్ పూర్ణ నటిస్తుండడం మాకు గర్వకారణం. "బ్యాక్ డోర్" చిత్రం ఆమె కెరీర్‌కి మరో టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది" అని ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' అధినేత బి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. "బాలాజీగారు ప్రతి సీన్ ఎంతో ప్లానింగ్ తో, క్లారిటీతో తెరకెక్కించారు. దర్శకుడిగా బాలాజీ గారికి... నాకు, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చే చిత్రమిది" అని హీరోయిన్ పూర్ణ అన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు