ప్రైవేటు సెక్టార్‌లో 115,000 మంది పౌరులకు ఉద్యోగావకాశాలు

- January 25, 2021 , by Maagulf
ప్రైవేటు సెక్టార్‌లో 115,000 మంది పౌరులకు ఉద్యోగావకాశాలు

రియాద్:మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్స్ మరియు సోషల్ డెవలప్‌మెంట్, పలు ప్రముఖ కంపెనీలతో ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రైవేటు సెక్టార్‌లో 115,000 మంది సౌదీలకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ ఒప్పందం కుదరనుంది. తవ్‌తీన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ చర్యలు చేపడుతున్నట్లు లేబర్ సెక్టార్ డిప్యూటీ మినిస్టర్ అబ్దుల్లాహ్ అబుతనైన్ అలాగే సోషల్ డెవలప్‌మెంట్ సెక్టార్ డిప్యూటీ మినిస్టర్ మాజెద్ అల్ ఘనెమి వెల్లడించారు. 2021 మినిస్ట్రీ బడ్జెట్‌లో సౌదీ యువతకు ఉద్యోగాలు సహా అనేక అంశాలకు కీలక ప్రాధాన్యతనిస్తున్నారు. మూడు నెలలుగా ఉద్యోగానికి దూరంగా వుంటున్నవారు, ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని బడ్జెట్ రూపకల్పన జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com