అదృశ్యమైన విమానం కూలింది : నేపాల్
- February 24, 2016
నేపాల్ పర్వతాల్లో ఈ రోజు ఉదయం అదృశ్యమైన విమానం కూలిపోయింది. ఆ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 23మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల్లో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. విమానంలోని వారంతా మృతి చెందినట్లు తెలుస్తోంది. తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నేపాల్‌లోని పొఖారా నుంచి ఉదయం 7.45 గంటలకు జామ్‌సోమ్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన 8 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. అనంతరం పర్వత శ్రేణుల్లో విమానం కూలిపోయిందని, ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారం అందిందని జామ్సమ్ ప్రాంత పోలీసు చీఫ్ హరిహరి యోగి తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







