మోహన్‌లాల్ కొత్త సినిమా విడుదల తేదీ ఖరారు

- January 25, 2021 , by Maagulf
మోహన్‌లాల్ కొత్త సినిమా విడుదల తేదీ ఖరారు

కేరళ:మలయాళీ స్టార్ హీరో మోహన్‌లాల్ ఫాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిన విషయమే. అతడి సినిమా అంటే ఎంతో ప్రత్యేకంగా చూస్తారు అతడి అభిమానులు. మోహన్ లాల్‌కు అటు మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ్ భాషల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. అంతేకాకుండా మలయాళ సినీ పరిశ్రకు రికార్డులను పరిచయం చేసిన ఘనత కూడా మోహన్ లాల్ పేరు మీదే ఉంది. అతడు అద్భుత నటుడిగా సినీ ప్రేమికులందరికీ సుపరిచితమే. మోహన్ లాల్ సరికొత్తగా చేస్తున్న సినిమా ఆరట్టు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను ఇటీవల మోహన్ లాల్ స్వయంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను బీ ఉన్ని కృష్ణణ్ దర్శకత్వంలో రూపొందనుంది. మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత హాట్ టాపిక్‌గా ఉన్న సినిమా ఇది. అయితే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అందులో మెగాస్టార్ కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మోహన్ లాల్ ఇటీవల దృశ్యం2 సినిమాను రూపొందించారు. ఈ సినిమాను మోహన్ లాల్ ఓటీటీ వేదికగా విడుదల చేయాలని ఆలోచన చేశారు. ఈ సినిమా విడుదలపై క్లారిటీ రాకముందే ఈ స్టార్ హీరో తన తదుపరి చిత్రం రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com