'ఖిలాడి' ఫస్ట్ గ్లిమ్ప్స్
- January 26, 2021
హైదరాబాద్:‘క్రాక్’ హిట్ మాస్ మహారాజా రవితేజలో జోష్‌ని నింపింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇదే జోష్ లో తన తదుపరి సినిమా ‘ఖిలాడి’ మొదలు పెట్టేశాడు. రమేశ్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
రవితేజ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో రవితేజ ఎప్పటిలాగే మాస్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. చేతులో రాడ్ పట్టుకొని తనదైన శైలీలో నడుస్తూ నయా లుక్‌లో అదరగొట్టాడు. ఎటువంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇందులో రవితేజ డ్యూయోల్ రోల్లో నటించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ వేసవిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు