డొమెస్టిక్ వర్కర్స్ క్వారంటైన్ 5 రోజులకు తగ్గించాలని విజ్ఞప్తి

- January 26, 2021 , by Maagulf
డొమెస్టిక్ వర్కర్స్ క్వారంటైన్ 5 రోజులకు తగ్గించాలని విజ్ఞప్తి

కువైట్ సిటీ :డొమెస్టిక్ హెల్పర్స్‌కి సంబంధించి క్వారంటైన్‌ని 5 రోజులకు తగ్గించాలంటూ విజ్ఞప్తి చేసినట్లు డొమెస్టిక్ హెల్ప్ కార్యాలయాల యూనియన్ హెడ్ ఖాలిద్ అల్ దఖ్నన్ చెప్పారు. రెండు వారాలకు బదులుగా క్వారంటైన్‌ను 5 రోజులకు తగ్గించేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. దేశంలోకి వచ్చేముందు మూడు పిసిఆర్ టెస్టులు చేయించినవారికి ఈ అవకాశం కల్పించాలన్నది యూనియన్ వాదనగా కనిపిస్తోంది. పౌరులు అలాగే వలసదారులకు ఇది ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందనీ, వారిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఖాలిద్ అభిప్రాయ పడ్డారు. కామర్స్ మినిస్ట్రీ నిర్ణయం మేరకు రిక్రూట్మెంట్ రేటుని 990 కువైటీ దినార్స్ (ఒక్కో హెల్పర్‌కి) అలాగే, క్వారంటైన్ నిమిత్తం 490 కువైటీ దినార్స్ (ఫిలిప్పీన్స్ నుంచి వచ్చేవారికి), 390 కువైటీ దినార్స్ (ఇండియా నుంచి వచ్చేవారికి) చెల్లించాల్సి వుంటుంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com