OMR4కే మస్కట్ టు సలాలాకు ఫ్లైట్..సలాం ఎయిర్ ఆఫర్
- January 26, 2021
మస్కట్:ఒమన్ లోని లో బడ్జెట్ ఎయిర్ లైన్స్ సలాం ఎయిర్ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 4 రియాల్స్ తో ఫ్లైట్ టికెట్ రాజధాని మస్కట్ నుంచి సలాలాకు ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా తమ ప్రయాణికులకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు సలాం ఎయిర్ వెల్లడించింది. అయితే..ఈ ఆఫర్ జనవరి 30 ఒక్క రోజుకే పరిమితం అని స్పష్టం చేసింది. ప్రయాణికులు www.salamair.com వెబ్ సైట్ ద్వారా లేదా 2427-2222కి కాల్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చని కూడా తెలిపింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం జనవరి 30న మస్కట్ నుంచి సలాలాకు తమ తొలి కమర్షియల్ ఫ్లైట్ టేకాఫ్ అయిందని..అందుకే ఈ జనవరి 30 కేవలం 4 రియాల్స్ కే ఫ్లైట్ టికెట్ ఆఫర్ చేస్తున్నామని వివరించింది లో బడ్జెట్ ఎయిర్ లైన్స్. ఇదిలాఉంటే..సంస్థ ప్రకటించిన లో టికెట్ ప్రైజ్ ఆఫర్ కు ప్రయాణికులకు నుంచి అనూహ్య స్పందన వస్తున్నట్లు...టికెట్లు వేగంగా అమ్ముడు పోతున్నట్లు సలాం ఎయిర్ వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు