సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే జైలు,10 లక్షల దిర్హాముల జరిమానా
- January 26, 2021
దుబాయ్:సోషల్ మీడియా వినియోగదారులు..ఏదైనా పోస్టులు పెట్టే ముందు..ఇతర పోస్టులను షేర్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.లేదంటే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కొక తప్పదు.అంటే జస్ట్ ఒక్క తప్పుడు పోస్టుతో కోరి కష్టాలను కొని తెచ్చుకోవడమే అనమాట. పౌరులు, ప్రవాసీయులను ఉద్దేశించి దుబాయ్ పోలీసులు చేసిన హెచ్చరిక ఇది. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి గతంలో కూడా హెచ్చరించిన దుబాయ్ పోలీసులు..ఇప్పుడు మరోసారి పునరుద్ఘాటించారు.ఎవరైనా ఎదుటి వారిని, ఇతర మత విశ్వాసాలను కించపరిచేలా పోస్టులు పెట్టినా, నేరాలను, హింసను ప్రేరేపించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసినా ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు 2,50,000 దిర్హామ్ ల నుంచి 10 లక్షల దిర్హామ్ వరకు జరిమానా ఉంటుందని హెచ్చిరించారు.ముఖ్యంగా కొన్ని పోస్టింగ్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఇస్లాం మతాన్ని, మత విశ్వాసాలను కించపరిచేలా పోస్టు పెట్టడం.ఇస్లాం మతమే కాదు..ఇతర ఏ మతాలు సూచించిన ఆచారాలు, విశ్వాసాలను కించపరచొద్దు.పాపాలను, నేరాలను ప్రొత్సహించేలా, ప్రేరేపించేలా పోస్టులు ఉండకూడదు.కింగ్డమ్ లో ఉంటున్న అన్ని వర్గాలు, మతాల విశ్వాసాలను గౌరవించటం, సహనశీలతతో ఉండటంతో యూఏఈ లక్షణమని వివరించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..