సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే జైలు,10 లక్షల దిర్హాముల జరిమానా

- January 26, 2021 , by Maagulf
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే జైలు,10 లక్షల దిర్హాముల జరిమానా

దుబాయ్:సోషల్ మీడియా వినియోగదారులు..ఏదైనా పోస్టులు పెట్టే ముందు..ఇతర పోస్టులను షేర్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.లేదంటే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కొక తప్పదు.అంటే జస్ట్ ఒక్క తప్పుడు పోస్టుతో కోరి కష్టాలను కొని తెచ్చుకోవడమే అనమాట. పౌరులు, ప్రవాసీయులను ఉద్దేశించి దుబాయ్ పోలీసులు చేసిన హెచ్చరిక ఇది. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి గతంలో కూడా హెచ్చరించిన దుబాయ్ పోలీసులు..ఇప్పుడు మరోసారి పునరుద్ఘాటించారు.ఎవరైనా ఎదుటి వారిని, ఇతర మత విశ్వాసాలను కించపరిచేలా పోస్టులు పెట్టినా, నేరాలను, హింసను ప్రేరేపించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసినా ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు 2,50,000 దిర్హామ్ ల నుంచి 10 లక్షల దిర్హామ్ వరకు జరిమానా ఉంటుందని హెచ్చిరించారు.ముఖ్యంగా కొన్ని పోస్టింగ్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఇస్లాం మతాన్ని, మత విశ్వాసాలను కించపరిచేలా పోస్టు పెట్టడం.ఇస్లాం మతమే కాదు..ఇతర ఏ మతాలు సూచించిన ఆచారాలు, విశ్వాసాలను కించపరచొద్దు.పాపాలను, నేరాలను ప్రొత్సహించేలా, ప్రేరేపించేలా పోస్టులు ఉండకూడదు.కింగ్డమ్ లో ఉంటున్న అన్ని వర్గాలు, మతాల విశ్వాసాలను గౌరవించటం, సహనశీలతతో ఉండటంతో యూఏఈ లక్షణమని వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com