సౌదీ: ఐదుగురికి మించి కార్మికులు గుమికూడితే సంస్థ క్లోజ్...
- January 27, 2021
రియాద్:కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించింది సౌదీ అరేబియా ప్రభుత్వం. కార్మికులు తాము పని చేసే చోట గుమికూడకుండా, సమావేశం అవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలదేనని అంతర్గత మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఒక వేళ నిబంధన పరిమితికి మించి ఐదుగురి కంటే ఎక్కువ మంది కార్మికులు ఒకే చోట గుమికూడితే సంస్థ ఇన్ ఛార్జ్ కి 50 వేల రియాల్స్ జరిమానా విధిస్తామని, అలాగే సమావేశానికి కారణమైన వ్యక్తికి 5 వేల రియాల్స్ ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఒకవేళ రెండోసారి కూడా నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో సమావేశం అయితే..సంస్థ ఇన్ ఛార్జ్ కి లక్ష రియాల్స్, సమావేశానికి కారణమైన వ్యక్తి 10 వేల రియాల్స్ జరిమానా విధిస్తామని వెల్లడించింది. మూడోసారి కూడా నిబంధన ఉల్లంఘిస్తే ఇన్ ఛార్జ్ తో పాటు సమావేశమైన కార్మికులు అందరిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేసింది. ఒకవైళ్ల నిబంధనల ఉల్లంఘన ప్రైవేట్ సంస్థలో జరిగితే..మూడు నెలల పాటు సంస్థను మూసివేస్తామని, అయినా..మళ్లీ రూల్స్ బ్రేక్ చేస్తే ఆరు నెలల పాటు సంస్థను మూసివేస్తామని అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష