దుబాయ్:ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు..
- January 27, 2021_1611734467.jpg)
దుబాయ్:ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు దుబాయ్ మానవ వనరుల శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక నుంచి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కోవిడ్ 19 పేషెంట్ తో నేరుగా కాంటాక్ట్ అయితే..అతను వెంటనే సంబంధిత ఉన్నతాధికారికి సమాచారం అందించింది పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..ఆ పది రోజుల పాటు ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా వెసులుబాటు కల్పిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరకపోతే అత్యవసర సెలవులుగా పరిగణిస్తామని వెల్లడించింది. అయితే..రెండోసారి కూడా క్వారంటైన్ లో ఉండాల్సి వస్తే వార్షిక సెలవుల నుంచి కోత విధిస్తామని, ఒకవేళ వార్షిక సెలువులు బ్యాలెన్స్ లేకుంటే జీతంలో నుంచి పది రోజుల శాలరీ కట్ చేయనున్నట్లు మానవ వనరుల శాఖ వివరించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దీనిపై ఉద్యోగులకు సంబంధిత ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించింది. అంతేకాదు..కోవిడ్ పేషెంట్ తో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండి కూడా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచాలని చూస్తే మాత్రం అలాంటి ఉద్యోగులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని దుబాయ్ మానవ వనరుల శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష