సింగరేణిలో ‘సలార్’ సినిమా షూటింగ్
- January 27, 2021
హైదరాబాద్:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించారు. 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ జనవరి 29 నుంచి సలార్ షూటింగ్ లో పాల్గొననున్నాడని సమాచారం. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పెద్దపెల్లి జిల్లాలోని రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ఫైటింగ్ సన్నివేశాన్ని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారట. ఈమేరకు సలార్ సినిమా సెట్స్ లో బిజీగా ఉందట చిత్రబృందం. ఈ సినిమా అనంతరం ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే ఖరారు అయింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు