సింగరేణిలో ‘సలార్’ సినిమా షూటింగ్
- January 27, 2021హైదరాబాద్:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించారు. 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ జనవరి 29 నుంచి సలార్ షూటింగ్ లో పాల్గొననున్నాడని సమాచారం. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పెద్దపెల్లి జిల్లాలోని రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ఫైటింగ్ సన్నివేశాన్ని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారట. ఈమేరకు సలార్ సినిమా సెట్స్ లో బిజీగా ఉందట చిత్రబృందం. ఈ సినిమా అనంతరం ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే ఖరారు అయింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు