న్యూస్ట్రెయిన్ తో సమర్ధవంతంగా పోరాడుతున్న కోవాగ్జిన్
- January 27, 2021
న్యూ ఢిల్లీ: కరోనా కేసులు దేశంలో తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా స్ట్రెయిన్ కేసులతో దేశం ఆందోళన చెందుతున్నది. పాత కరోనా వైరస్ కంటే కొత్త స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. ఈ కొత్త స్ట్రెయిన్ వలన బ్రిటన్ లో అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచం దీనిపై దృష్టి సారించింది. ఇక ఇదిలా ఉంటే, ఇండియాలో భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ న్యూ స్ట్రెయిన్ వైరస్ పై సమర్ధవంతంగా పోరాటం చేస్తున్నట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. వైరస్ ను తటస్థీకరించడంతో పాటుగా, మ్యూటేషన్ చెందుతూ వైరస్ తప్పించుకునే ప్రభావాన్ని కూడా తగ్గించడంతో కోవాగ్జిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని, 26 మందిపై జరిపిన ప్రయోగాల ఫలితాలే ఇందుకు నిదర్శనం అని భారత్ బయోటెక్ తెలిపింది. ఇక కోవాగ్జిన్ టీకా సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు ది లాన్సెట్ పత్రిక కూడా పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష