కరోనా వచ్చిందా? అయితే ఈ రూల్స్ చదవండి..
- January 27, 2021
యూఏఈ: ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు దుబాయ్ మానవ వనరుల శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక నుంచి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కోవిడ్ 19 పేషెంట్ తో నేరుగా కాంటాక్ట్ అయితే..అతను వెంటనే సంబంధిత ఉన్నతాధికారికి సమాచారం అందించింది పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..ఆ పది రోజుల పాటు ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా వెసులుబాటు కల్పిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరకపోతే అత్యవసర సెలవులుగా పరిగణిస్తామని వెల్లడించింది. అయితే..రెండోసారి కూడా క్వారంటైన్ లో ఉండాల్సి వస్తే వార్షిక సెలవుల నుంచి కోత విధిస్తామని, ఒకవేళ వార్షిక సెలువులు బ్యాలెన్స్ లేకుంటే జీతంలో నుంచి పది రోజుల శాలరీ కట్ చేయనున్నట్లు మానవ వనరుల శాఖ వివరించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దీనిపై ఉద్యోగులకు సంబంధిత ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించింది. అంతేకాదు..కోవిడ్ పేషెంట్ తో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండి కూడా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచాలని చూస్తే మాత్రం అలాంటి ఉద్యోగులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని దుబాయ్ మానవ వనరుల శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







