31న బుర్జ్ ఖలీఫా పై 'విక్రాంత్ రోనా' టైటిల్ లోగో లాంచ్
- January 27, 2021
దుబాయ్:కిచ్చా సుదీప్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఫాంటమ్'. అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గత యేడాది మార్చి1 హైదరాబాద్ లో మొదలైంది. కరోనా కారణంగా కొంతకాలం షూటింగ్ ను ఆపేసిన చిత్ర బృందం... అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ తిరిగి జులై 16న హైదరాబాద్ లోనే మలి షెడ్యూల్ ను జరిపింది. ఓ రకంగా కరోనా సమయంలోనూ షూటింగ్ జరిపి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు కిచ్చా సుదీప్.ఈ సినిమా షూటింగ్ అత్యధిక భాగం ఫిల్మ్ సిటీలోనూ, అన్నపూర్ణ స్టూడియోలోనూ జరిగింది.ఆ తర్వాత కేరళ, మహారాష్ట్రలలోని పలు ప్రదేశాలలో చిత్రీకరణ జరిపారు.తాజా ఈ మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద భవనం బుర్జ్ ఖలీఫా పై ఈ నెల 31న ఈ మూవీ టైటిల్ లోగో ను, స్నీక్ పీక్ ను విడుదల చేయబోతోంది మూవీ టీమ్.విశేషం ఏమంటే... ఇంతకాలం 'ఫాంటమ్'గా ఉన్న పేరును 'విక్రాంత్ రోనా'గా మార్చామని, ఇది సుదీప్ పోషిస్తున్న అండర్ వరల్డ్ డాన్ పాత్ర పేరని నిర్మాత జాక్ మంజు తెలిపారు! ఆ కొత్త టైటిల్ లోగో, 130 సెకన్ల స్నీక్ పీక్ కోసం సుదీప్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







