80 ట్రిప్పుల భవన నిర్మాణ వ్యర్ధాలు, రాళ్ల తొలగింపు

- January 27, 2021 , by Maagulf
80 ట్రిప్పుల భవన నిర్మాణ వ్యర్ధాలు, రాళ్ల తొలగింపు

బహ్రెయిన్: బహ్రెయిన్ లోని హహాలా ప్రాంతంలో 80 ట్రిప్పుల భవన నిర్మాణ వ్యర్ధాలు, రాళ్లను తొలగించినట్లు స్థానిక మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణ వ్యర్ధాలు పేరుకుపోతుండటం పెద్ద సవాలుగా మారటంతో..వ్యర్ధరహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే హమాలా ఉత్తర ప్రాంతంలో భారీగా పేరుకుపోయిన వ్యర్ధాలను, రాళ్లను తొలగించారు మున్సిపాలిటీ అధికారులు. అలాగే బాధ్యతరహితంగా వ్యవహరిస్తూ వ్యర్ధాల డంపింగ్ కోసం నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా పబ్లిక్ ప్రాంతాలు, ఇరుగు పొరుగు నివాస ప్రాంగణాల్లో పడేసిన వారికి అధికారులు ఫైన్ విధించారు. మొత్తం 14 షాపులకు జరిమానా విధించారు. అలాగే ఇరుగు పొరుగు నివాస ప్రాంగణాల్లో వ్యర్ధాలను డంప్ చేసిన వ్యక్తికి 300 దినార్ల ఫైన్ విధించినట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ వ్యర్ధాలు పోగవటం పెద్ద సమస్యగా మారిందని..ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించి భవన వ్యర్ధాలను నిర్దేశించిన డంపింగ్ ప్రాంతంలోనే వేయాలని మున్సిపల్ కౌన్సిల్ కోరింది. దీనిపై ప్రజల్లో అవగహన పెంచేందుకు చర్యలు చేపట్టామని, భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, కార్మికులు కూడా తమకు సహకరించి మున్సిపాలిటీని మరింత సౌందర్యంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని మున్సిపల్ కౌన్సిల్ పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com