కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి డిస్కౌంట్లు, ఫ్రీ ఆఫర్లు

- January 27, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి డిస్కౌంట్లు, ఫ్రీ ఆఫర్లు

యూఏఈ: దేశాన్ని కోవిడ్ ఫ్రీ కంట్రీగా మార్చేందుకు యూఏఈ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందకు వెళ్తోంది. ఇప్పటికే 2.67 మిలియన్ డోసులను ప్రజలకు అందించి వ్యాక్సినేషన్ రేటింగ్ లో రెండో ప్లేసులో నిలిచింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి పీసీఆర్ టెస్టుల నుంచి మినహాయింపులు ఇస్తూ..ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రొత్సహాక వాతావరణాన్ని కల్పిస్తోంది. అయితే..ప్రభుత్వ చర్యలకు మద్దతుగా పలు ప్రైవేట్ సంస్థలు, రెస్టారెంట్లు, టాక్సీ సంస్థలు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రత్యేక డిస్కౌంట్లు, ఫ్రీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి 10 శాతం డిస్కౌంట్ ప్రకటిస్తున్న ది ఎమిరాతి డ్రైవింగ్ ఇన్సిటిట్యూట్ ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపిస్తే 10 శాతం రాయితీతో డ్రైవింగ్ స్కూల్ లో జాయిన్ కావొచ్చని ఆఫర్ ఇచ్చింది. ఇక దుబాయ్ టాక్సి సంస్థ హలా కూడా వ్యాక్సిన్ తీసుకునే వారికి ఫ్రీ రైడ్ ఆఫర్ ప్రకటించింది. ఎమిరాతి పరిధిలోని 10 వ్యాక్సిన్ కేంద్రాల నుంచి ఉచితంగా ఇంటికి ప్రయాణించొచ్చని వెల్లడించింది. ఉబర్ ట్యాక్సీ కూడా  డిస్కౌంట్ రైడ్ ఆఫర్ ప్రకటించింది. రెండు సార్లు 25 శాతం డిస్కౌంట్ తో తమ ట్యాక్సీల్లో ప్రయాణం చేయవచ్చని, అలాగే ఫిబ్రవరి 8 వరకు ఉచిత ప్రయాణం ఆఫర్ కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. రెస్టారెంట్లు, కాఫీ కేఫ్ లు కూడా రాయితీలు ప్రకటించాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి తమ కాఫీ కేఫ్ లో బ్లాక్ కాఫీ పూర్తి ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. కాఫీ, పాలపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని స్పష్టం చేసింది. అలాగే గేట్స్ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న మూడు రెస్టారెంట్లలో తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారికి 10 శాతం రాయితీ, రెండో డోసు తీసుకున్న వారికి 20 శాతం రాయితీ ఇస్తున్నారు. అయితే..వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com