భారత్ ఆర్థికాభివృద్ధిలో 'కస్టమ్స్‌' కీలకపాత్ర: టి.గవర్నర్‌ తమిళిసై

- January 27, 2021 , by Maagulf
భారత్ ఆర్థికాభివృద్ధిలో \'కస్టమ్స్‌\' కీలకపాత్ర: టి.గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్:భారత దేశ ఆర్థికాభివృద్ధిలో కస్టమ్స్‌ విభాగం కీలకపాత్ర పోషిస్తోందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.హైదరాబాద్‌ కస్టమ్స్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కస్టమ్స్‌ డే-2021 వేడుకల్లో గవర్నర్‌ పాల్గొని ప్రసంగించారు. 

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సంక్షోభ సమయంలో కస్టమ్స్‌ విభాగం అద్భుత సేవలందించిందన్నారు. సమర్థవంతమైన సరఫరా చైన్‌ సిస్టం ద్వారా కస్టమ్స్‌ విభాగం ముఖ్యపాత్ర పోషిందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా గవర్నర్ అవార్డులను, ప్రత్యేక ప్రశంస ధృవీకరణ పత్రాలను విజేతలకు అందజేసి వారి సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో 
డాక్టర్ పి.సౌందరరాజన్(ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్),మల్లికా ఆర్య(చీఫ్ కమిషనర్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్),జెఎస్ చంద్రశేకర్(ప్రిన్సిపల్ కమిషనర్), జెబి మోహపాత్రా(ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్-IT), డి. పురుషోత్తం(ప్రిన్సిపల్ కమిషనర్-GST తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com