దుబాయ్ లో కోవిడ్ నియంత్రణ చర్యలు...ఆస్పత్రులకు కొత్త మార్గదర్శకాలు
- January 28, 2021_1611812393.jpg)
దుబాయ్:కోవిడ్ స్ట్రెయిన్ ముప్పు పొంచిఉండటంతో మరోసారి ప్రపంచ దేశాలు ముందు జాగ్రత్త చర్యలను కఠినతరం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ హెల్త్ అథారిటీ కూడా అప్రమత్తమైంది. వైరస్ వేరియంట్లు విస్తరించకుండా ఎమిరేట్ పరిధిలో ఇప్పటికే పలు ఆంక్షలతో పాటు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గైడ్ లైన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఆస్పత్రులకు కూడా కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆస్పత్రుల్లో ఒకేసారి ఎక్కువ మంది గుమికూడకుండా ఉండేందుకు అపాయింట్మెంట్ విధానాన్ని కఠినంగా పాటించాలని సూచించింది. ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్న వారినే ఆస్పత్రులకు అనుమతించాలని, అలాగే ఒక్కొక్క అపాయింట్మెంట్ మధ్య 20 నిమిషాల వ్యవధి ఉండేలని స్పష్టం చేసింది. భౌతిక దూరం పాటించేలా వేయింటింగ్ ప్రాంతంలో కనీసం రెండు మీటర్ల దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేయాలంది. మాస్కులు లేకుండా ఎవరిని ఆస్పత్రుల్లోకి అనుమతించొద్దని సూచించింది. ఆస్పత్రికి వచ్చే వారి మెడికల్ హిస్టరీ, ఇతర వివరాలను విధిగా నమోదు చేయటంతో పాటు కోవిడ్ లక్షణాలు ఉంటే పీసీఆర్ టెస్టుకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈఎన్టీ వంటి స్పెషలైజేషన్ వార్డులో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించాల్సి వచ్చిన పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అన్ని జాగ్రత్త ప్రమాణాలు పాటించి ప్రత్యేక గదుల్లో చికిత్స అందించాలని సూచించింది. వైద్య సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు పీపీఈ కిట్లను ధరించాలని..ఎమిరాతి పరిధిలో కావాల్సినంతగా పీపీఈ స్టాక్ ఉందన్నారు. వైద్య విద్యా కోర్సులో ఉన్నవారికి డిస్టెన్స్, ఈ-లెర్నింగ్ విధానాలను పాటించాలని పేర్కొంది. ఆస్పత్రుల్లో జన సామార్ధ్యాన్ని తగ్గించేందుకు టెలిమెడిసిన్ విధానాన్ని అవలంభించాలని..టెలిమెడిసిన్ కు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది. ఇక ఆస్పత్రుల్లో పిల్లల ఆటస్థలాలను పూర్తి మూసివేయటంతో పాటు..రిసీప్షన్, వేయింటింగ్ ఏరియా, ఎలివేటర్స్, డోర్ హ్యాండిల్స్, కన్సల్టింగ్ గదుల్లో ఎప్పటికప్పుడు డిసిన్ఫెక్షన్ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆస్పత్రుల ఎంట్రెన్స్ లో అవగాహన కల్పించేలా బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలంది. తమ ఆదేశాలను పాటించటంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన ఆస్పత్రులు, ఆస్పత్రి నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని దుబాయ్ హెల్త్ అథారిటీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష