కోవిడ్ స్ట్రెయిన్ విస్తరించకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరిక

- January 28, 2021 , by Maagulf
కోవిడ్ స్ట్రెయిన్ విస్తరించకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరిక

కువైట్ సిటీ:కోవిడ్ స్ట్రెయిన్ కింగ్డమ్ లో విస్తరించకుండా..ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కువైట్ ప్రధాని షేక్ సబా ఖలేద్ అల్ అహ్మద్ అల్ సబా అన్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన ఆయన..వైరస్ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ 19 కారణంగా పారిశ్రామిక రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని...ఇప్పటికీ ఆ సంక్షోభం కొనసాగుతోంది..ఎప్పటికీ బయట పడతామో కూడా ఖచ్చితంగా చెప్పలేమని అభిప్రయాపడ్డారు. దేశీయంగా దాదాపు 30 వేల పరిశ్రమలు కోవిడ్ సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 225 మిలియన్ల మంది ఉద్యోగాలు కొల్పొవాల్సి వచ్చిందని అన్నారు. కింగ్డమ్ పరిధిలో రెండు బ్రిటన్ స్ట్రెయిన్ కేసులు గుర్తించిన తర్వాత విమానాశ్రయాల్లో ముందు జాగ్రత్త చర్యలను మరింత ముమ్మరం చేశామన్నారు. కింగ్డమ్ పరిధిలో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా సంక్షోభం నుంచి బయటపడతామని విశ్వసిస్తున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com