ఒమన్ లో కోవిడ్ ఎఫెక్ట్..వర్సీటీలు, ఈవెంట్లు, విదేశీయానంపై ఆంక్షలు
- January 28, 2021_1611811371.jpg)
మస్కట్:కోవిడ్ 19 తర్వాత వైరస్ వేరియంట్ల ముప్పు పొంచి ఉండటంతో ఒమన్ అప్రమత్తం అవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో వైరస్ ఉత్పరివర్తనాలు వ్యాపిస్తుండటంతో మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తోంది. ఇప్పటికే పొరుగు దేశాలతో భూ సరిహద్దులను మూసివేసిన ఒమన్..విమానాల్లో విదేశీ ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది. దేశంలోని పౌరులు, ప్రవాసీయులు కొన్నాళ్ల పాటు విదేశీ ప్రయాణాలు మానుకుంటే మంచిదని సూచించింది. అలాగే అన్ని గ్రూప్ ఈవెంట్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ సమీక్షలు, సమావేశాలు, స్పోర్ట్స్ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు అన్ని ఈవెంట్లపై నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే యూనివర్సిటీల ప్రారంభాన్ని కూడా కొన్నాళ్లు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!