‘సిటిమార్’ సినిమా విడుదల తేదీ ఖరారు
- January 28, 2021
హైదరాబాద్:టాలీవుడ్ హీరో గోపీచంద్ విభిన్నమైన కథతో సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీ మార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా రానుందని తెలుస్తోంది. ఇక గోపీచంద్ సరైన హిట్ కొట్టి చాలానే రోజులు అవుతుంది. మిల్కీ బ్యూటీ తమన్నా దర్శకుడు సంపత్ నందితో ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాలు చేయగా మరోసారి ‘సిటిమార్’ హీరోయిన్ గా నటిస్తోంది. గోపీచంద్ కూడా ఈ దర్శకుడితో గతంలో ‘గౌతమ్ నంద’ సినిమాతో వచ్చాడు. ఇదిలావుంటే, తాజాగా వీరి కలయికలో ‘సిటిమార్’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 2వ తేదీన థియేటర్లలోకి వస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా తరువాత గోపీచంద్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ విషయాన్ని మారుతి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు