ఉద్యోగులకు విధులకు హజరవ్వాల్సిందే..పుకార్లపై ఒమాన్ క్లారిటీ

- January 28, 2021 , by Maagulf
ఉద్యోగులకు విధులకు హజరవ్వాల్సిందే..పుకార్లపై ఒమాన్ క్లారిటీ

ఒమాన్: కోవిడ్ స్ట్రెయిన్ కేసులను కట్టడి చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్న వేళ...కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి ఓ ప్రచారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఉద్యోగులు పని ప్రదేశాలకు రావాల్సిన అవసరం లేదంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సుప్రీం కమిటీ..ఉద్యోగులకు సంబంధించిన ప్రచారంలో నిజం లేదని, అవన్ని ఉట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. ఉద్యోగుల పనివేళలు, పని ప్రదేశానికి హజరయ్యే అంశాలకు సంబంధించి తాము ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది. పని ప్రదేశాలకు రాకుండా ఉద్యోగులకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని సుప్రీం కమిటీ క్లారిటీ ఇచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com