ఏపీలో కరోనా కేసుల వివరాలు
- January 28, 2021
అమరావతి:ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కరోనా వివరాలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ బులిటెన్ రిలీజ్ చేసింది. కొత్తగా 36,189 నమూనాలను పరీక్షించగా 117 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,87,466కు చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఏ ఒక్కరూ మృతిచెందకపోవడం ఊరటనిచ్చే విషయం. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా 7,152 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి తాజాగా మరో 128 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 8,78,956 మందికి పైగా బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,358 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,30,12,150 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







