సరఫరాలో ఆలస్యం: మరోమారు కోవిడ్ వ్యాక్సినేషన్ రీ-షెడ్యూల్
- January 29, 2021
రియాద్:సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మరోమారు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను రీ-షెడ్యూల్ చేసింది. సరఫరాలో అంతరాయాల నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను రీ-షెడ్యూల్ చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. తయారీదారు నుంచి సౌదీ అరేబియాతోపాటు ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాక్సినేషన్ సరఫరాలో సమస్యలు తలెత్తినట్లు మినిస్ట్రీ వివరించింది. కాగా, రెండో డోస్, మొదటి డోస్ తీసుకున్న తర్వాత ఆరు వారాల్లోపు వేయించుకోవాల్సి వుంటుంది. జనవరి 20న వ్యాక్సినేషన్ రీ-షెడ్యూల్ అయినట్లు మినిస్ట్రీ ప్రకటించిన విషయం విదితమే. వ్యాక్సిన్ తయారీ సంస్థ ఫైజర్ అలసత్వం కారణంగానే ఈ సమస్య తలెత్తింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే మరిన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్ పక్రియ వేగం పుంజుకుంటుందని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







