కార్ల శానిజైటేషన్ కోసం ‘వాటర్-లెస్ ఎకో కార్ వాషింగ్’...

- January 29, 2021 , by Maagulf
కార్ల శానిజైటేషన్ కోసం ‘వాటర్-లెస్ ఎకో కార్ వాషింగ్’...

హైదరాబాద్: COVID-19 నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షిత ప్రయాణం కోసం కార్లను శుభ్రపరచడానికి తక్కువ నీటిని ఉపయోగించుకునే వాటర్-లెస్ ఎకో వాషింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.

విమానాశ్రయంలోని ఈ కార్ వాషింగ్ సర్వీసులో – కారు బాడీని శుభ్రపరచడం, వాక్యూమ్ క్లీనింగ్, టైర్ క్లీన్ అండ్ పాలిష్, ఎయిర్ ఫ్రెషనర్, డాష్‌బోర్డ్ డ్రెస్సింగ్, డీప్ క్లీన్ సర్వీసెస్ ఉంటాయి. ఇది వాహనాల పూర్తి పరిశుభ్రతకు, సురక్షిత ప్రయాణానికి సహకరిస్తుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించే, వాహనం పెయింట్ మన్నికను కాపాడే 3-ఎమ్ ఉత్పత్తులను కార్లను శుభ్రపరచడంలో ఉపయోగిస్తున్నారు. క్లీనర్లకు తగిన శిక్షణ ఇవ్వడం వల్ల వాహనాలపై ఎలాంటి మరకలూ ఉండవు. 

వాటర్-లెస్ ఎకో వాషింగ్ కియోస్క్‌లలో ఒకటి కార్ పార్కింగ్ జోన్–C ప్రవేశద్వారం వద్ద ఉండగా, మరొకటి విమానాశ్రయ లాడ్జ్ సమీపంలో టాక్సీలకు కేటాయించిన ప్రదేశంలో ఉంది. వాహనం ఎక్కడ ఉన్నా సంబంధం లేకుండా, కార్ పార్క్ లోపల వాహనం ఉన్న చోటే ఈ సర్వీసును అందిస్తారు. 24 గంటల పాటు అందించే ఈ 100% కాంటాక్ట్‌లెస్ సర్వీసులో నగదు, డిజిటల్ చెల్లింపులు రెండూ చేయవచ్చు.

మే 25 న విమానాశ్రయ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటి నుండి, ప్రయాణీకులకు భద్రత, పరిశుభ్రతా చర్యలను బలోపేతం చేయడానికి GHIAL తన భాగస్వాములందరితో కలిసి నిరంతరం పని చేస్తోంది. అన్ని అథరైజ్డ్ ఎయిర్ పోర్ట్ టాక్సీ సర్వీసులు - మేరు, స్కైకాబ్, ఓలా, ఉబెర్, వన్ కార్, శ్రీనివాస టూర్స్ & ట్రావెల్స్ వంటి వాటికి కోవిడ్-19 నిబంధనల గురించి, ప్రయాణీకులను తీసుకెళ్లేటప్పుడు అనుసరించాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. 

విమానాశ్రయంలోని భద్రతా చర్యలు విమానాశ్రయ పార్కింగ్ జోన్ నుండి ప్రారంభమవుతాయి, ఇక్కడ భౌతిక దూరపు గుర్తులు, డిజిటల్ చెల్లింపుల గురించి, ఇతర కాంటాక్ట్‌-లెస్ సౌకర్యాలతో పాటు, ప్రయాణీకులకు పరిశుభ్రమైన టాక్సీలను అందించడానికి ఒక మెరుగైన వ్యవస్థను కూడా అమలులోకి తీసుకువచ్చారు. 

విమానాశ్రయంలోకి ప్రవేశించే అథరైజ్డ్ టాక్సీ సర్వీసుల డ్రైవర్‌లందరికీ థర్మల్‌ పరీక్షలు నిర్వహించి, శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉన్న డ్రైవర్లను మాత్రమే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. ప్రతి డ్రైవర్ తన వాహనాన్ని తీసుకెళ్లడానికి ముందు టాక్సీ శానిటైజేషన్ జరుగుతుంది, తద్వారా ప్రయాణికుల విశ్వాసం పెరుగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com