దారుణానికి పాల్పడ్డ భారతీయ అమెరికన్ వైద్యుడు
- January 29, 2021
అమెరికా:43 సంవత్సరాల భరత్ నారుమంచి చిన్నపిల్లల వైద్యుడు. భరత్ ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఉండగా.. అతడు జీవితం చివరి దశలో ఉన్నాడు. మరికొన్ని వారాలకు మించి బతికే అవకాశాలు లేవు. భరత్ ఇటీవల చిల్డ్రన్ మెడికల్ గ్రూప్ అనే బాలల వైద్య సేవల సంస్థలో స్వచ్ఛందంగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అతడి దరఖాస్తును అధికారులు అంగీకరించకపోవడంతో అతడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భరత్ తుపాకీ చేతపట్టుకుని ఆ మెడికల్ గ్రూప్ కేంద్రంలో ప్రవేశించి కొందరిని బందీలుగా పట్టుకున్నాడు. వారిలో కొందరు తప్పించుకోగా, క్యాథరిన్ లిండ్లే డాడ్సన్ అనే లేడీ డాక్టర్ ను భరత్ కాల్చి చంపాడు. ఆపై తాను కూడా కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. ఆస్టిన్లో మంచి హస్తవాసి ఉన్న చిన్నపిల్లల వైద్య నిపుణురాలిగా కేథరిన్ లిండ్లే డాడ్సన్కు చక్కని పేరుంది. భరత్ నారుమంచి తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు జరిగిందో తెలియడంలేదని, పోలీసుల దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రెండు పెద్ద బ్యాగులు, ఒక తుపాకీతో ఆ ఆస్పత్రిలోకి భరత్ ప్రవేశించారు. ఆస్పత్రిలో పిల్లలు గానీ రోగులు గానీ ఆ సమయంలో లేరు. ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. నారుమంచి ఒక్కసారిగా తుపాకీ ఎక్కుపెట్టి లిండ్లే డాడ్సన్ సహా ఐదుగురు వైద్యులను బందీలుగా తీసుకున్నారు. ఆరుగంటల పాటు టెన్షన్ నెలకొంది. బందీలైన వైద్యుల్లో నలుగురిని భరత్ వదిలేయగా.. మిగిలిన ఒక్క వైద్యురాలు లిండ్లే డాడ్సన్ను భరత్ తుపాకీతో కాల్చి చంపాడు. ఆపై తనను తాను కాల్చుకొని ప్రాణాలు విడిచాడు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష