దుమ్ము లేపుతున్న ఆచార్య టీజర్.!!
- January 29, 2021
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు సినిమాలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే లేటెస్ట్ గా కొద్దిసేపటి క్రితం రిలీజైన ఆచార్య టీజర్ అది నిజమని ప్రూవ్ చేసింది. ఆచార్య టీజర్ ఓ ధర్మస్థలిని కాపాడే వ్యక్తి.. పాఠాలు చెప్పకపోయినా గుణపాఠాలు చెబుతాడు కాబట్టే అతన్ని అందరు ఆచార్య అంటారేమో అని చూపించారు.
ఇక సినిమా టీజర్ లో మెగాస్టార్ హీరోయిజం పీక్స్ లో చూపించాడు కొరటాల శివ. ఇదివరకు ఎప్పుడూ తన సినిమాలో హీరోలను చూపించనంత పవర్ ఫుల్ గా ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవిని చూపిస్తున్నారని తెలుస్తుంది. ఇక చిరు టీజరే ఇలా ఉంటే సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న సిద్ధ అదేనండి రాం చరణ్ రోల్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆచర్యలో చిరు లుక్, స్టైల్, యాక్షన్, ఫైట్స్ ఇవన్ని మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.
కచ్చితంగా ఆచార్య సినిమా మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునే ఫుల్ మీల్స్ మూవీగా ఉంటుందని చెబుతున్నారు. సినిమాను సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేయగా మే 9న రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ కూడా ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చిరు ఆచార్య టీజర్ అరుపులు పెట్టించగా సినిమా అంతకుమించి అనిపించేలా ఉంటుందని అనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు